ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శిగా చాంద్ పాషా
అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శిగా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఎస్.కె. చాంద్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా మహాసభల్లో..
జూలూరుపాడు, ఆగస్టు 28 : అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శిగా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఎస్.కె. చాంద్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా మహాసభల్లో ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా శుక్రవారం జూలూరుపాడు మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన యువతకు నిరుద్యోగ భృతి అందించాలని, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషాతో పాటు జిల్లా నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో యువజన సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

