Passport Rules : దేశంలో పాస్‌పోర్ట్ రూల్స్ మారిపోనున్నాయి. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కొత్త రూల్స్‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను గురువారం, సెప్టెంబర్ 17న విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. 15 ఏళ్లలోపు పిల్లలకు జారీ చేసే పాస్‌పోర్టు వ్యాలిడిటీ ఇకపై ఐదేళ్ల కాలపరిమితితోనే ఉంటుంది. అలాగే, 18 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
18 ఏళ్ల తర్వాత జారీ అయ్యే పాస్‌పోర్టు మాత్రమే అదనపు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ అంశంలో ఇప్పటికే ఉన్న పాస్‌పోర్ట్ రూల్స్, 1980 చట్టానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మార్పులు చేసింది. పాస్పోర్ట్స్ (అమెండ్మెంట్) రూల్స్, 2026 పేరిట కొత్త నిబంధనలతో గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి సవరించిన రూల్ 12 (1ఏ) ప్రకారం.. 15 ఏళ్లలోపు వారికి 36 పేజీల పాస్‌పోర్టు జారీ చేస్తారు. 15 ఏళ్ల వయసులో తీసుకుంటే.. ఐదేళ్ల కాలపరిమితికి గాను 20 ఏళ్లు వచ్చే వరకు వ్యాలిడిటీ ఉండదు. గరిష్టంగా 18 ఏళ్ల వరకు మాత్రమే దీని వ్యాలిడిటీ ఉంటుంది.
13 ఏళ్లకు పాస్‌పోర్ట్ జారీ అయితే ఐదేళ్ల వ్యాలిడిటీతో 18 ఏళ్ల వరకు వాడుకోవచ్చు. అలాగే, 14, 15 ఏళ్లు అయితే.. గరిష్టంగా మరో నాలుగు, ఐదు సంవత్సరాల వ్యాలిడిటీ మాత్రమే వస్తుంది. 18 ఏళ్లు వచ్చిన వారు కొత్త పాస్‌పోర్టు తీసుకోవాల్సిందే. పిల్లలకు జారీ చేసే పాస్‌పోర్టులో గరిష్టంగా 36 పేజీలు మాత్రమే ఉంటాయి. పాస్‌పోర్టు దరఖాస్తు ఫీజులను ప్రభుత్వం ఇటీవల సవరించిన సంగతి తెలిసిందే. ఫీజులు పెంచుతూ అమెండ్మెంట్ రూల్ 8ను తీసుకొచ్చింది. దీనిపై ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది.