దమ్మపేట, ఆగస్టు 22 : బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు పిలుపుతో అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట(మండలం), మందలపల్లి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 97 రాష్ట్రంలోని పాలిటెక్నిక్ (డిప్లొమా) విద్యా వ్యవస్థను, కళాశాలలను ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ అలాగే ‘శక్తి’ స్కీమ్‌లో విలీనం చేయడానికి ప్రతిపాదించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. వారి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ నేడు రాస్తారోకో నిర్వహించడం జరిగిందన్నారు.
స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన శక్తి స్కీమ్ తొలగించాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవో97ను వెనక్కి తీసుకోవాలి. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్లో చేరే లేటరల్ ఎంట్రీ (ECET ద్వారా) అవకాశం యథావిధిగా కొనసాగించాలి. జీవో ప్రకారం మళ్లీ ఇంటర్మీడియట్ చదివి ఎంసెట్ రాయాల్సి వస్తే విద్యార్థులు మూడు సంవత్సరాల చదువు వృథా అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. సాంకేతిక విద్యా విభాగాన్ని ప్రత్యేకంగా ఉంచి, ప్రభుత్వమే పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు వెంపటి భరత్ కుమార్, నియోజకవర్గ యువజన విభాగ మాజీ కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు, మండల యూత్ మాజీ అధ్యక్షుడు మండవ సత్య, మండల నాయకులు దారా యుగుందర్, నాయకపోడు సంఘం రాష్ట్ర నాయకుడు రావుల శ్రీనివాసరావు, అల్ల జంగం, మండల మాజీ ఉపాధ్యక్షులు గాజుబోయిన యేసు బాబు, తుమ్మల లక్ష్మణరావు, సర్పంచ్ సోయ్యం సత్యవతి, ఊప సర్పంచ్ ముత్తిన రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ కాసిని శ్రీను, మాజీ కో ఆప్షన్ ఎంపీటీసీ బుడే, అబ్దుల్ జిన్న, వెలుగోటి మహేష్, వార్డు సభ్యులు దారా రాము, రూప రాంబాబు, ఉయ్యాల లక్ష్మీనారాయణ, మండల ఎస్సీ సెల్ నాయకులు మద్దెల పుల్లారావు, కొలిపోగు ధర్మ, బీసీ మండల నాయకులు తాళ్ల వెంకటేశ్వరావు, పాకనాటి శ్రీను, వల్లెపు నాగేశ్వరావు, పాశ్యం ప్రసాద్, బండి ప్రసాద్, బాకీ శ్రీను, కొల్లి శేఖర్, నడిపల్లి పోలయ్య, అడపా నరసయ్య నాయుడు, సవలం నరసింహారావు, సోయం హేమంత్, సోయం వీర్రా స్వామి, పానుగంటి లోకేష్, తోలేం మల్లేశ్వరావు, దోద్దుల వెంకన్న, సున్నం బాలకృష్ణ, సోయం నాగేంద్ర బాబు, కిసర ప్రేమ్ సాగర్, తోగర్త నాగరాజు, మచ్చల ముత్యాలు, గుర్రమం వెంకట రామయ్య, కందుకూరి రాంబాబు, మేకల వెంకటేశ్వరావు, చిక్కాల గోపి, చిక్కాల రవీంద్ర, తాళ్ల శివ, రావుల విరభద్రం, రావుల లక్ష్మణ్, పాశం శరణ్, చక్రాల పోలరాజు, పిట్టల లాలు, చిలకబత్తుల యేసు పాల్గొన్నారు.

జీ.వో.97 ను రద్దు చేయాలని బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం ధర్నా