టేకులపల్లి, ఏప్రిల్ 09 : ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం టేకులపల్లి మండలం దాస్ తండాలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమాలు నిర్వహించిన కేసీఆర్కు తెలంగాణ ప్రజల హృదయాల్లో, చరిత్రలో సుస్థిర స్థానం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బోడ బాలు, బానోత్ రామ, చీమల సత్యనారాయణ, జాలాది అప్పారావు, మాలోతు ఫుల్ సింగ్, సురేందర్, కుమ్మరి కిరణ్, రవి కుమార్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.