– కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం
– ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో కార్పొరేటర్ సింధు తపస్వి నిరసన
కొత్తగూడెం గణేష్ టెంపుల్, మే 22 : బీఆర్ఎస్ పాలన అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని ఆ పార్టీ కార్పోరేటర్ సింధు తపస్వి అన్నారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఏమి జరగలేదని ప్రసంగించడాన్ని నిరసిస్తూ సింధు తపస్వి ఆందోళన చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఓడిన కోరం కనకయ్యను జడ్పీ చైర్మన్ చేసిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. నాడు అన్ని పదవులు అనుభవించి నేడు బీఆర్ఎస్ ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. కోరం కనకయ్య మాటలకు నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సింధు తపస్సుని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడం కాంగ్రెస్ పార్టీ అధికార దాహానికి అద్దం పట్టినట్టు నిలిచింది. సమావేశం మందిరం నుండి బయటకు పంపించే ప్రయత్నం చేయడంతో ఆమె వారిని ప్రతిఘటించి ప్రజాప్రతినిధికి మాట్లాడే హక్కు ఉందని, తనను సమావేశం నుండి పంపించే హక్కు ఎవరికీ లేదంటూ నిలదీశారు.