కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూన్ 06 : కొత్తగూడెం కార్పొరేషన్ అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారుల ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించని అధికారులు ఎందుకు అంటూ ప్రశ్నించారు. కార్పొరేషన్ కమిషనర్, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండకుండా అధికార యంత్రంగానికి తొత్తులుగా పని చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ కమిషనర్, అధికారులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారులు, సిబ్బంది అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సింధు తపస్వి, మల్లెల సప్నకుమారి, భీమ శ్రీవల్లి, మల్హోత్రా సాగర్, బత్తుల మధు చందు, గుణ చరిత్, రాంబాబు పాల్గొన్నారు.