ఇల్లెందు, సెప్టెంబర్ 12 : ప్రస్తుత సమాజంలో ఉన్నత చదువులు చదివి, పది మంది విద్యార్థులకు ఉపయోగపడేలా వారికి అవసరమైన పుస్తకాలను గ్రంథాలయానికి బహూకరించడం అభినందనీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. శుక్రవారం ఇల్లెందు పట్టణం జెకె సెంటర్ గ్రంథాలయానికి పట్టణానికే చెందిన అందే శరణ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంటెక్ ఎంట్రెన్స్ కు సంబంధించిన విలువైన పుస్తకాలను కొని గ్రంథాలయానికి గ్రంథాలయ చైర్మన్ వీరబాబు సమక్షంలో గ్రంథాలయ బాధ్యులు రుక్మిణికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అందే సతీశ్, శ్రీను, ఉపేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.