కొత్తగూడెం అర్బన్, జూలై 24 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పాత కొత్తగూడెం పాఠశాలలోని విద్యార్థులకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి గురువారం నోట్ పుస్తకాలు, పెన్నులు అందజేశారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తోగరు రాజశేఖర్, రామిళ్ల మధు, ఎండీ.హుస్సేన్, మాజీ కౌన్సిలర్ ప్రసాద్, టి.అశోక్, పూర్ణ చందర్, ఖాజా బక్ష, షణ్ముఖ్, మేహినూద్దీన్, ఆర్.శ్రీనివాస్ పాల్గొన్నారు.