ఇల్లెందు, జూన్ 19 : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) ఈ నెల 21, 22 తేదీల్లో నిజామాబాద్లో నిర్వహించే మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం ఇల్లెందులో టీయూసీఐ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిసిసి కార్యాలయం నుండి గోవింద్ సెంటర్, కొత్త బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం కొత్త బస్టాండ్ సెంటర్లో ఏరియా అధ్యక్షుడు పాయం వెంకన్న అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామయ్య, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, ఏరియా కార్యదర్శి మల్లెల వెంకటేశ్వర్లు మాట్లాడారు. నిజామాబాద్ సభలో టీయూసీఐ జాతీయ అధ్యక్షుడు అమ్రీష్ పటేల్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వనమాల కృష్ణ, కె.సూర్యం, ఎస్ఎల్ పద్మ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.
ఈ సభలకు అన్ని రంగాల కార్మికులు కదిలి రావాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో 35 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత, కనీస వేతనాలు, ఇతర చట్టాలు అమలు కావట్లేదని ఆరోపించారు, ఈ కార్యక్రమంలో టీయూసీఐ ఏరియా నాయకులు బొల్లి సీతారాములు, బోళ్ల రవి, హమాలీ యూనియన్ అధ్యక్షుడు గట్టు ఎలేందర్, బ్రాంచ్ కార్యదర్శి కొత్తపల్లి రఘు, వీరన్న, పిళ్లి మల్లేశ్, వేముల గురునాథం, దుర్గ, మహేశ్, సదా, మోటం సంపత్, చంద్రమౌళి, సందీప్, వెంకటేశ్, బాలాజీ, నందు, భాజ్య శ్రీను పాల్గొన్నారు.