జూలూరుపాడు, డిసెంబర్ 05 : చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలోఈ నెల 6 నుండి 9వ తేదీ వరకు జరిగే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్(ఐఐఎస్ఎఫ్) లో జరిగే సైన్స్ సఫారీ టీచర్ వర్క్ షాప్‌నకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైన్స్ అధికారి, జూలూరుపాడు మండలం కాకర్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు బి.సంపత్ కుమార్ (భౌతిక శాస్త్ర) ఎంపికయ్యారు. ఈ మేరకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా నుండి ఆయన ఆహ్వానం అందుకున్నారు. “ఉపాధ్యాయ బోధనలు-మెలకువలు” అనే అంశంపై జరిగే వర్క్ షాప్ లో ఆయన పాల్గొననున్నారు. ఐఐఎస్‌ఎఫ్‌కు ఎంపికవడంపై డీఈఓ బి.నాగలక్ష్మి, ఏఎంఓ నాగరాజశేఖర్, ఎంఈఓ బి.జంకిలాల్, కాకర్ల హెడ్మాస్టర్ పి.సంజీవరావు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, జిల్లా సైన్స్ ఉపాధ్యాయులు సంపత్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.