ఇల్లెందు, సెప్టెంబర్ 30 : ఇల్లెందు ప్రభుత్వ పాఠశాల ముందు గిరిజన ఆశ్రమ పాఠశాల డైలీ వేజ్ వర్కర్ల నిరవధిక సమ్మె 19వ రోజు కొనసాగింది. ఇందులో భాగంగా హాస్టల్ కార్మికులు మంగళవారం మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్థానిక మెయిన్ రోడ్డుపై హాస్టల్ డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ కార్మికులు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి మాట్లాడుతూ.. కార్మికులు అర్ధాకలితో అలుమటిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మె మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి కృష్ణ, పాయం ముత్తయ్య, నాగేశ్వరరావు, స్వామి, మంగ, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, రామకళా, రాజు, పద్మ, జయ, స్వరూప, అంజమ్మ, నాగులు, ఎర్రమ్మ, ధనలక్ష్మి, బాలమ్మ పాల్గొన్నారు.