భద్రాచలం : బీసీ రిజర్వేషన్ల అంశంపై, తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల పిలుపుమేరకు, భద్రాచలం బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో 42 % బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా..బిల్లును పటిష్టంగా తయారుచేసి అమలుపరిచే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని వారు డిమాండ్ చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బీసీల కొరకు ఏ విధంగా రిజర్వేషన్ తీసుకువచ్చారో గుర్తు చేశారు. బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమానికి వివిధ కులాలకు సంబంధించిన బీసీ సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.