కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 22 : దసరా ఉత్సవాల్లో బతుకమ్మ మహిళా శక్తికి, ఐక్యతకు ప్రతీక అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్. వి.పాటిల్ అన్నారు. సోమవారం గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల భాగంగా రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకలు జరుపగా కలెక్టర్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి స్ఫురించేలా బతుకమ్మల అలంకరణ, పాటలు, నృత్యాలతో కార్యక్రమం ఉత్సాహ భరితంగా కొనసాగింది. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి బతుకమ్మ పూజలో కలెక్టర్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ కృషి, ప్రతిభతో కుటుంబ అభివృద్ధి, ఆర్థిక స్వావలంబనలో కీలక పాత్ర పోషిస్తున్నారు అని, ఇలాంటి సాంప్రదాయ పండుగలు మహిళల ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో, పరస్పర ఐక్యతను బలపరచడంలో తోడ్పడతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత, గ్రామీణ అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ దిశగా పలు చర్యలు చేపడుతోంది. అందులో బతుకమ్మ పండుగ ప్రత్యేక స్థానం కలిగి ఉంది అని, ప్రతీ ఒక్కరూ ఈ పండుగను పర్యావరణ హితంగా, సమైక్యతతో జరుపుకోవాలని కలెక్టర్ అన్నారు.
Kothagudem Urban : మహిళా శక్తి, ఐక్యతకు ప్రతీక బతుకమ్మ : కలెక్టర్ జితేశ్ వి.పాటిల్
స్వచ్ఛతా హీ సేవ – 2025లో భాగంగా స్వచ్ఛోత్సవ్ – పక్షోత్సవాలు లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లో అధికారులతో కలిసి కలెక్టర్ సెల్ఫీ దిగారు. ఈ వేడుకలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సీపీఓ సంజీవరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలతా లేనినా, జిల్లా వైద్యశాఖ అధికారి జయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ అధికారి శ్రీలత, మెప్మా పీడీ రాజేశ్, మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఐడిఓసి సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Kothagudem Urban : మహిళా శక్తి, ఐక్యతకు ప్రతీక బతుకమ్మ : కలెక్టర్ జితేశ్ వి.పాటిల్