రామవరం, అక్టోబర్ 07 : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని కొత్తగూడెం బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్ లక్కినేని సత్యనారాయణ ఆధ్వర్యంలో న్యాయవాదులు జిల్లా కోర్టు బయట నిరసన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులపై జరిగే ఏ దాడినైనా న్యాయవ్యవస్థ స్వతంత్రతపై దాడిగా పరిగణించబడాలని లక్కినేని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే న్యాయమూర్తుల భద్రత, గౌరవం, స్వతంత్రతను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జె.గోపీకృష్ణ, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, సహాయ కార్యదర్శి కాసాని రమేశ్, కార్యవర్గ సభ్యులు ఉప్పు అరుణ్, కె.కృష్ణ ప్రసాద్, అడపాల పార్వతి, మాలోత్ ప్రసాద్, న్యాయవాదులు ఊటుకూరి పురుషోత్తంరావు, పి.నిరంజన్, ఎస్.విజయ్ భాస్కర్ రెడ్డి, అత్తులూరి మనోరమ, గడదీసి కాంతయ్య, సంగు ఉపేందర్, ఉమ్మడి శాంత, ఎర్రపాటి కృష్ణ, తిరునగరి వెంకటేశ్వర్లు, మహమ్మద్ సాదిక్ పాషా, దోడ్డ సామంత్, పాల రాజశేఖర్, వడ్లకొండ హరి, ఉప్పుశెట్టి సునీల్ కుమార్, మారపాక రమేశ్, కె.శ్రీధర్, పాతూరి పాండురంగ విటల్ పాల్గొన్నారు.