రామవరం, మే 12 : రేపు (మంగళవారం) జరుగబోయే పాలీసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో ఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఆరు పరీక్షా కేంద్రాల్లో 3,352 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. కొత్తగూడెంలో 6, భద్రాచలంలో 2, మణుగూరులో 3 కలిపి మొత్తం 11 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రవేశ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు రెండు గంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఒక్క నిమిషం అలస్యమైనా అభ్యర్థిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని తెలిపారు. ఏ విదమైన ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవన్నారు.
కొత్తగూడెం జిల్లా. కేంద్రంలోని సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో 500 మంది. రామచంద్ర డిగ్రీ కాలేజీలో 240 మంది, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 316 మంది, అబ్దుల్ కలాం కాలేజీలో 284 మంది, ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో 240 మంది, పాట్యంది ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 100 మంది అభ్యర్ధులు హాజరవుతారన్నారు. అలాగే భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అటానమస్ లో 380 మంది, డిగ్రీ కాలేజీ సైన్స్ బ్లాక్లో 352 మంది, దునుగూరు పట్టణంలోని ఉన్నత పాఠశాలలో 200 మంది. ప్రభుత్వ గిగ్రీ కాలేజీలో 247 మంది, ప్రభుత్వ జానియర్ కాలేజీలో 126 మంది అభ్యర్థులు పరీక్ష హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.