రామవరం, ఏప్రిల్ 29 : ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ అందిస్తున్న యూపీఎస్సీ సివిల్స్ -2026 ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ పొందేందుకు విశ్వవిద్యాలయం అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ అర్హత పరీక్షలో మెరిట్ సాధించిన వారికి ఏడాది పాటు ఉచిత శిక్షణ, భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు.
యూపీఎస్సీ ఈ ఏడాది ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జామియా మిలియాలో శిక్షణ పొందిన 32 మంది అభ్యర్ధులు సత్తా చాటినట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు తమ వివరాలను https://admission.jmi.ac.in వెబ్సైట్ నందు రూ.1,200 పరీక్ష రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 8520860785 నంబర్ కు సంప్రదించాలని పేర్కొన్నారు.