రామవరం, జూలై 30 : గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్ & నాన్ ఇంజినీరింగ్)/ డిప్లొమా విద్యను గత ఐదు సంవత్సరాల్లో (2021, 2022, 2023, 2024 &2025) పూర్తి చేసిన విద్యార్థులు సింగరేణి సంస్థ నందు అప్రెంటిస్ షిప్ చేయుటకు అవకాశం. అప్రెంటిస్ షిప్‌నకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ (225).. మైనింగ్ -60, ఈఈఈ-45, ఈసిఈ-20, సిఎస్ఈ-20, ఐటి-15, మెకానికల్-45, సివిల్ -20
(07 ఇంజినీరింగ్ బ్యాచ్స్)
నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ (200)
బిఎ-60, బిఎస్సి-60, బీకాం-60, బిబిఏ-5, బిసిఎ-5, బి-ఫార్మసీ -10
(ఆరు నాన్ ఇంజినీరింగ్ బ్యాచ్స్)
డిప్లొమా హోల్డర్ (100).. మైనింగ్-30, ఈఈఈ-25, మెకానికల్-25, సివిల్-20
(ఫోర్ ఇంజినీరింగ్ బ్యాచ్స్) మొత్తం 525 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్థులు తమ దరఖాస్తులను 08.08.2025 సాయంత్రం 05.00 గంటల వరకు సింగరేణి వెబ్ పోర్టల్ నందు లేదా “www.nats.education.gov.in (i.e NATS 2.0)” నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అలాగే సింగరేణి నందు అప్రెంటిస్ట్ చేయుటకు ఆసక్తి కలిగిన విద్యార్థులు “www.scclmines.com/apprenticeship” వెబ్ పోర్టల్ నందు తేదీ.11.08.2025 సాయంత్రం 03.00 గంటల వరకు దరఖాస్తు చేసుకుని దరఖాస్తులను ప్రింట్ తీసుకుని దగ్గరలో ఉన్న మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (MVTCs) నందు ఇవ్వాలన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు18 నుండి 28 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. (ఎస్సీ, ఎస్టీ & బీసీ విద్యార్థులకు తేదీ.31.07.2025 వరకు 33 సంవత్సరాలు వరకు వయో పరిమితిని సడలించినట్లు పేర్కొన్నారు.