– జూలై 1 నుండి 3 వరకు దరఖాస్తుల స్వీకరణ
– రుద్రంపూర్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్
రుద్రంపూర్, జులై 01 : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పాలీసెట్-2026 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు స్పాట్ కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని వెల్లడించారు. జూలై 1 నుండి 3వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. దరఖాస్తుతో పాటు అన్ని విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు సమర్పించాలని సూచించారు. వివరాలకు అభ్యర్థులు రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సంప్రదించాలని ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ పేర్కొన్నారు.