Gangaram Thanda : ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్తి తనకు ఓటు వేయలేదని అన్నదాతపై పగబట్టాడు. జూలూరుపాడు మండలం గంగారం తండా(Gangaram Thanda)లో సర్పంచ్‌గా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ‘నాకు ఓటేయవా నీ సంగతి చెబుతానంటూ’.. కొర్రా చిన్నరాములు (Korra Chinna Ramulu) అనే రైతు ఆరబోసిన వడ్ల కుప్పను మోటారు పెట్టి నీళ్లతో తడిపేశాడు.
ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లన్నీ తడిసిముద్దవ్వడంతో చిన్నరాములు లబోదిబోమన్నాడు. ఓటు వేయకుంటే కష్టపడి పండించిన పంటను నాశనం చేస్తారా? అని రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం నీళ్లకు తడిసి రంగు మారిన వడ్లను రోడ్డుపై పోసి నిరసన తెలిపాడు. తన వడ్ల కుప్పలను నాశనం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి వైఖరిపై చిన్నరాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి కంప్లైట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయలేదని, ఆరబోసిన వరిపంటకు నీళ్ళు పెట్టి తడిపిన కాంగ్రెస్ నాయకుడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గంగారం తండాలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయలేదని రైతు కొర్రా చిన్నరాములు ఆరబోసిన వడ్ల కుప్పలో మోటారుతో… pic.twitter.com/6QG1pP3nzv
— Telugu Scribe (@TeluguScribe) December 22, 2025