రుద్రంపూర్, జనవరి 31 : చుంచుపల్లి మండలం ధన్‌బాద్ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో ఎస్టీ లూయిస్ మ్యారి డి మాన్ ఫోర్ట్ 353 జయంతిని పురస్కరించుకుని శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో పాటు ప్రత్యేకంగా ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్టీ లూయిస్ మేరీ డి మాన్ ఫోర్ట్ ఆశయాలను విద్యార్థులు తమ జీవితాల్లో ఆచరణలో పెట్టేలా చూడడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు వివిధ రకాల ఫుడ్ కోర్ట్‌లను ఏర్పాటు చేయగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు రుచికరమైన వంటకాలను ఆస్వాదించారు. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బ్రదర్ జెరోమియాస్, బ్రదర్ దయాబన్ పాల్గొన్నారు.

Rudrampur : సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం