రామవరం, సెప్టెంబర్ 20 : గత 40 సంవత్సరాలుగా తెలుగుతో పాటు హిందీ, మలయాళ, తమిళ్, కన్నడ పంజాబీ మొదలైన భారతీయ భాషల్లో సినీ, లలిత, జానపద, గజల్, తిల్లానా, జావలి లాంటి గీతాలను ఆలపిస్తూ అన్ని భాషల సంగీత అభిమానులను ఆనంద పరుస్తున్న అల్లి శంకర్ ఇండియా సింగర్ అవార్డు అందుకున్నారు. ఎఫ్టీపీసీ ఇండియా హైదరాబాద్ సంస్థ వారి ఆధ్వర్యంలో బేగంపేట్ కంట్రీ క్లబ్లో జరిగిన గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎఫ్టీపీసీ సంస్థ శంకర్‌ను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు సోనం, నేహా దీక్షిత్, ముమైత్ ఖాన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి మాల్యాద్రి, ఎఫ్ టి పి సి అధ్యక్షుడు చైతన్య, జనరల్ సెక్రెటరీ వి.ఎస్.వర్మ, మీడియా చైర్మన్ కిరణ్ బేజాడీ, చంద్రశేఖర్, అంతర్జాతీయ మిమిక్రీ రత్న రమేశ, సినీ డైరెక్టర్ వి.సముద్ర, పలువురు సినీ కళాకారులు పాల్గొన్నారు.