భద్రాచలం, అక్టోబర్ 27 : కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని, ప్రధాన రహదారులను తక్షణమే బాగు చేయాలని బీఆర్ఎస్ భద్రాచలం మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రోడ్లన్నీ ధ్వంసమైనట్లు తెలిపారు. నియోజవర్గంలో ఇసుక దోపిడీతో రోడ్లన్నీ పాడైపోయి ప్రజలు నరకయాతన అనుభవిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. భద్రాచలం పట్టణంలో అనేక సమస్యలు విలయతాండవం చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న అభివృద్ధి శూన్యమన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకుడు కొల్లం జయ ప్రేమ్‌కుమార్, కోలా రాజు, బత్తుల నరసింహులు, అయినాల రామకృష్ణ, బాసిపోయిన మోహన్ రావు, అంబటి కర్ర కృష్ణ, పార్టీ నాయకులు కుందూరి అప్పారావు, కాపుల సూరిబాబు, పసుపులేటి రమేశ్, ఇమంది నాగేశ్వరరావు, జక్కం గోపి, కొల్లిపాక శివ, ఆకోజు పృథ్వీ, తాండ్ర ప్రసాద్, ఎస్కే అబ్దుల్ ఖాదర్, చిట్టిమల్ల అనిల్ కుమార్, కల్లూరి శ్రీరాములు, మహిళా నాయకురాలు కావూరి సీతామహాలక్ష్మి, పూజల లక్ష్మి, ప్రియాంక, రవికుమారి, కామేశ్వరి, సలోమి పాల్గొన్నారు.