– ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి పింగిలి నరేశ్ పిలుపు
ఇల్లెందు, మార్చి 20 : ఇల్లెందు పట్టణంలో ఉన్న మున్నూరు కాపులందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పట్టణ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి పింగిలి నరేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం స్థానిక కరెంట్ ఆఫీస్ వద్ద గల పింగళి హోండా షోరూంలో నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుండి ఇల్లెందు పట్టణంలో మున్నూరు కాపులు అన్ని పార్టీలకి అండగా నిలిచారన్నారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 5వ వార్డులో చిల్లా విజయభారతి, 19వ వార్డులో పింగళి అనూహ్య ఇద్దరు గెలిచారని, వారు మున్నూరు కాపు సంఘం నుండి కౌన్సిలర్ గా విజయం సాధించడం అభినందనీయమన్నారు.
పట్టణంలో అధిక శాతం ఉన్న మున్నూరు కాపులను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకుంటున్నాయని, పదవుల విషయంలో పక్కన పెట్టడం బాధకరమన్నారు. మున్నూరు కాపు కులస్తులు అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలవాలని ఆకాంక్షించారు. ఇల్లెందులో మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్ కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కొక్కు నాగేశ్వర్ రావు, కటకం పద్మావతి, లలిత శారద, సీనియర్ న్యాయవాది దంతాల ఆనంద్, ఉపాధ్యక్షులు పగడాల చందు, పాలెపు ఆనంద్, రాజౌరి మంజుల, నల్ల శ్రీను, దుర్గారావు, పెద్దినేని హరి, కల్వల సుధాకర్, చెట్టి సునీత, రాగవరపు రాకేశ్, ప్రేమ్, గౌతమ్ నాయుడు, నితీశ్ నాయుడు, బత్తిని సాంబ పాల్గొన్నారు.