ఇల్లెందు, అక్టోబర్ 30 : కొమరారంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని అఖిల భారత రైతుకులీ సంఘం (AIKMS) ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి మూడ్ మాలు డిమాండ్ చేశారు. గురువారం కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని పోచారం గ్రామంలో మెంథా తుఫాను వల్ల నష్ట పోయిన మిర్చి, వరి, పత్తి పంటలను అఖిల భారత రైతు కూలీ సంఘం ఇల్లెందు మండల ప్రధాన కార్యదర్శి మూడు మాలు, న్యూడెమోక్రసీ ఇల్లెందు మండల సహాయ కార్యదర్శి మోతిలాల్తో కలిసి ఏఐకేఎంఎస్ మండల ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో కొమరారం, పోచారం, బోయి తండా లలో నష్ట పోయిన పంట పొలాలను పరిశీలించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ..తుపాను కారణంగా ఇల్లెందు మండలంలో మిర్చి, వరి, పత్తి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు రాలేదన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. నవంబర్ 4 వ తేదీన ఇల్లెందులో నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాజీ సర్పంచ్ శ్రీను, జోగా కృష్ణ, తుడుం శ్రీను, లక్ష్మ, కోటు, శిరోమణి, రాంచంద్, లింగయ్య, దేవుల, బుజ్జి, రాజాలు, తదితరులు పాల్గొన్నారు.