కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 25 : రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతను తీర్చాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనలతో సోమవారం కొత్తగూడెం రైతు వేదిక ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన తెలిపి మాట్లాడారు. యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు సరిపడా పంపిణీ చేయలేని చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. చెప్పులను లైన్లో పెట్టి రైతులు రాత్రింబవళ్లు సొసైటీ కేంద్రాల ఎదుట యూరియా కోసం పడికాపులు కాస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.
రైతులకు యూరియా సరఫరా చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయని మండిపడ్డారు. వెంటనే రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం మండల వ్యవసాయాధికారి కరుణ, ఏఈఓ అనూషకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్లు ప్రసాద్, తొగర్ రాజశేఖర్, రామిళ్ల మధు, సూరిబాబు, మొయినుద్దీన్, అన్వర్, గోబ్రియా, సాంగు, పూర్ణచందర్, అశోక్, రైతులు పాల్గొన్నారు.
Kothagudem Urban : రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలి : కాపు సీతాలక్ష్మి