బూర్గంపహాడ్, మే 16 : హత్యకేసులో నిందితుడిని అరెస్టు చేసి శనివారం కోర్టుకు హాజరు పర్చినట్లు పాల్వంచ సీఐ సతీష్ తెలిపారు. కేసు వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 11న ఉదయం 3.30 గంటల సమయంలో బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ఐటీసీ లారీ యార్డు పక్కన బీహార్‌కు చెందిన కుందన్‌సింగ్, చత్తీస్‌గఢ్ కు చెందిన డానియల్ నాగ్, విజయవాడకు చెందిన లక్ష్మణ్ గత కొంతకాలంగా రాయల్ ఆటో పార్ట్స్ లారీ మెకానిక్‌లుగా పనిచేస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు.
వారు అద్దెకు ఉంటున్న గది పక్కనే కరీంనగర్‌కు చెందిన శ్రావణ్ అనే వ్యక్తి లారీ మెకానిక్ పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. 10వ తేదీ రాత్రి కుందన్సింగ్కు శ్రావణ్ మద్యం మత్తులో గొడవ జరిగింది. ఆ గొడవని మనసులో పెట్టుకుని కుందన్సింగ్ను ఎలాగైనా చంపాలని శ్రావణ్ 11వ తేదీన 3.30 గంటల సమయంలో అక్కడ ఉన్న బండరాయితో కుందన్‌సింగ్ తలపై మోది హత్య చేశాడు. ఈ హత్య కేసుకు సంబంధించిన నిందితుడు శ్రావణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించి శనివారం కోర్టుకు రిమాండ్ చేసినట్లు సీఐ వెల్లడించారు.