భద్రాచలం, సెప్టెంబర్ 24 : భద్రాచలం పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీలో నివసిస్తున్న 13 ఏళ్ల దివ్యాంగురాలు చిట్టి జీవనోపాధి సమస్యలతో సతమతమవుతోంది. తల్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమవ్వగా అమ్మమ్మ అలిమా సంరక్షణలో ఆ చిన్నారి జీవనం సాగిస్తోంది. పోషణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని చిట్టి అమ్మమ్మ అలిమా ‘చేతన మీసేవ’ నిర్వాహకుడు భూక్యా రంజిత్ నాయక్‌కు తెలుపగా మానవతా దృక్పథంతో స్పందించారు.
బుధవారం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తూ 25 కిలోల బియ్యంను మదర్ థెరిస్సా వ్యవస్థాపక అధ్యక్షుడు కొప్పుల మురళి, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు భూక్యా మాన్ సింగ్, ప్రభుత్వ ఉపాధ్యాయులు దారావత్ భాస్కర్ చేతుల మీదుగా చిన్నారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ భూక్యా రంజిత్ నాయక్ లాంటి సేవా దృక్పథాన్ని ఆదర్శంగా తీసుకుని వారికి తోచిన సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి నవీన్ కుమార్ పాల్గొన్నారు.