టేకులపల్లి, జనవరి 27 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పెట్రాంచెలక సమీపంలో గల 25 కె.వి ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామ సమీప చేనులో 25 కె.వి ట్రాన్స్ఫార్మర్ ఉంది. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ ఫార్మర్ను పగులగొట్టి అందులోని కాపర్ వైర్‌ను చోరీ చేశారు. ఈ ఘటనపై టేకులపల్లి ఏఈ హాట్కర్ దేవా బోడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే ముత్యాలంపాడు క్రాస్ రోడ్ సమీపంలో కూడా ట్రాన్స్ ఫార్మర్ కాపర్ వైర్ ను దొంగలు అపహరించుకుపోయారు. కాపర్ వైర్ దుండగులను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.