
భద్రాద్రి జిల్లాలో 2,205 మంది అర్హులు
ప్రతి నెల 3 మాడ్యూల్స్‌లో శిక్షణ
అశ్వారావుపేట, ఆగస్టు 14 : ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా వారికి శిక్షణ ఇచ్చేందుకు ‘నిష్ట’ (నేషనల్ ఇనిషియేట్ ఫర్ స్కూల్ అండ్ టీచర్స్ హలిస్టిక్) కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. పాసైన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నది. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ‘నిష్ఠ’ కార్యక్రమం ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగనున్నది. అయితే, ఈ ఏడాది కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆన్లైన్లోనే శిక్షణ పొందుతున్నారు.
సర్కార్ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మార్పులు తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యం పెంపుపై దృష్టిసారించాయి. ఇందుకోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ‘నిష్ఠ’ (నేషనల్ ఇనిషియేట్ ఫర్ స్కూల్ అండ్ టీచర్స్ హోలీస్టిక్) కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. పాసైన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధ్రువీకరణ (సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్) పత్రం జారీ చేస్తున్నది. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ‘నిష్ఠ’ కార్యక్రమం ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగనున్నది. ప్రతి నెల 3 మాడ్యూల్స్‌లో శిక్షణనిస్తుంది. గతేడాది వరకు ప్రత్యక్షంగా శిక్షణ పూర్తి చేసిన ఉపాధ్యాయులు ఈ ఏడాది కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆన్లైన్లోనే శిక్షణ పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్ ఉన్నత, ప్రాథమికోన్నత, ఎయిడెడ్ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొంటున్నారు. ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని గుణాత్మక విద్యనందించేందుకు ‘నిష్ఠ’ దోహదపడుతోంది. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు డీఈవో పర్యవేక్షిస్తారు.
జిల్లాలో2,205 మంది ఉపాధ్యాయులు
భద్రాద్రి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 2,205 మంది ఉపాధ్యాయులు ‘నిష్ఠ’ శిక్షణలో పాల్గొంటున్నారు. ఇప్పటికే సుమారు 80 శాతం మంది ఉపాధ్యాయులు శిక్షణకు హాజరవుతుండగా.. మరో 20శాతం మంది ఇంకా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగే ఆన్లైన్ శిక్షణకు ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటుకున్నారు. ప్రతినెలలో 3 మాడ్యూల్ ఉంటాయి. వీటిని అదేనెలలో ఉపాధ్యాయులు పూర్తి చేయాలి. పూర్తి చేసిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ధ్రువీకరణ (సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్) పత్రం అందిస్తుంది. పూర్తి చేయని ఉపాధ్యాయులకు మళ్లీ శిక్షణనిస్తుంది. ప్రతి నెలలో 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. కనీసం 70 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. 70 శాతం మార్కులు రాకుంటే మరో మూడు అవకాశాలు ఉంటాయి. 70 శాతం మార్కులు సాధించిన ఉపాధ్యాయులకు కోర్సు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ అందుతోంది.
గుణాత్మక విద్యకు దోహదం
ఉపాధ్యాయుల్లో నైపుణ్యం పెంపునకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నిష్ఠ’ శిక్షణ దోహపడుతోంది. గుణాత్మక విద్య అందించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. కరోనా పరిస్థితుల్లో శిక్షణను ప్రభుత్వం ఆన్లైన్లోనే ఇస్తుంది. నెలలో ఇచ్చే మాడ్యూల్‌ను పూర్తి చేస్తే ఉపాధ్యాయులకు కంప్లీషన్ సర్టిఫికెట్‌ను అందజేస్తుంది.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నైపుణ్యం పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘నిష్ఠ’ ద్వారా అందిస్తున్న శిక్షణను ఉపాధ్యాయులంతా సద్వినియోగం చేసుకోవాలి. దీనిద్వారా గుణాత్మక విద్య అందించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం కంప్లీషన్ సర్టిఫికెట్‌ను అందిస్తుంది. కోర్సు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.