
తెలంగాణ సర్కారు నిర్ణయంతో అభివృద్ధి పథంలో పల్లెలు
పల్లెప్రగతి పనుల ప్రారంభంలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్
కొణిజర్ల, జూలై 1: అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికుల భాగస్వామ్యంతో పల్లెలను ప్రగతిబాట పట్టించాలని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పిలుపునిచ్చారు. మండలంలోని రామనర్సయ్యనగర్లో నాలుగో విడత పల్లెప్రగతి పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. తొలుత మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో పంచాయతీలకు నిధులు లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవని అన్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పల్లెల వెనుకబాటలు తనాన్ని గుర్తించి పల్లెప్రగతి పేరిట ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతోందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పల్లెల రూపురేఖలు మార్చాలని, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు పోట్ల శ్రీనివాసరావు, దొడ్డపునేని రామారావులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముందుగా స్థానికులు ఎమ్మెల్యేకు పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. సర్పంచ్ కొర్రా కాంతమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మార్క్ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఎంపీపీ గోసు మధు, జడ్పీటీసీ పోట్ల కవిత, ఎంపీటీసీ దొడ్డపునేని లలితకుమారి, ఏఎంసీ చైర్మన్ గుమ్మా రోశయ్య, ఎంపీడీవో ఆర్.రమాదేవి, తహసీల్దార్ జీ.కృష్ణ, రైతుబంధు సమితి అధ్యక్షుడు దొడ్డపునేని రామారావు, చెరుకుమల్లి రవి, బండారు కృష్ణ, ఏవో బాలాజీ, ఎంఈవో శ్యాంసన్, టీఆర్ఎస్ నాయకులు కోసూరి శ్రీనివాసరావు, పోట్ల శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య, డేరంగుల బ్రహ్మం, పాసంగులపాటి శ్రీనివాసరావు, కొల్లిపాక వెంకటేశ్వర్లు, ట్రాన్స్కో ఏఈ రఘోత్తమరెడ్డి, కొనకంచ మోష, తదితరులు పాల్గొన్నారు.