మధిర : బాబూ జగజ్జీవన్ రామ్ గొప్ప సంఘసంస్కర్త, దార్శనికుడు, ఆదర్శప్రాయుడని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు అన్నారు. శనివారం భారత మాజీ ఉపప్రధాని, భరతమాత ముద్దబిడ్డ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని స్థానిక MDO ఆఫీస్ ఆవరణలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడారు.
జగజ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్లో జన్మించి చిన్నతనం నుంచే ఆదర్శ భావాలతో నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకున్నారని రంగారావు తెలిపారు. అంటరానితనానికి వ్యతిరేకంగా సమానత్వం కోసం పోరాడి జాతీయ ఉద్యమంలో పోరాడిన మహా యోధుడని చెప్పారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో భారత ఉప ప్రధానిగా, వ్యవసాయ, రక్షణ, కార్మిక, రైల్వే తదితర మంత్రిత్వ శాఖలను సమర్ధవంతంగా నిర్వర్తించారని గుర్తుచేశారు.
ఆయన స్ఫూర్తితో అందరం కుల, మతాలకు అతీతంగా కలసికట్టుగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. నివాళులు అర్పించిన వారిలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఆర్ బ్రహ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కొమ్ము శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి తూమాటి కృష్ణా రెడ్డి, మధిర మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు చిలుకూరి సత్యనారాయణ రెడ్డి, పోలె సుధాకర్, ఎర్రుపాలెం మండల శాఖ అధ్యక్షులు బీ మదన్ మోహన్ రెడ్డి, నాయకులు పురం సంగారావు, పిల్లి నరసింహారావు, ఎల్ అప్పారావు, మల్లెల శ్రీనివాస్, చెడే సతీష్, T అజయ్ కుమార్, M నాగేశ్వరరావు, రుద్రపోగు శ్రీనివాస్, VVN రాజు, P రత్నబాబు, సుధాకర్, రామారావు, శీలం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.