చిన్నపిల్లల ప్రాణాలతో ఆటోడ్రైవర్ చెలగాటం
సెలవుదినం కావడంతో ఆటలాడుకుంటున్న చిన్నపిల్లల్ని మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన సరదా కోసం ఆటోలో తీసుకెళ్లి ప్రమాదానికి గురిచేసిన సంఘటన ఖమ్మంజిల్లా కారేపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కారేపల్లి మండలంలోని పేరుపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్, యజమాని వజ్జ సునీల్ అనే యువకుడు అతిగా మద్యం సేవించాడు.
- సరదా కోసం పిల్లాడి చేతికి ఆటో ఇవ్వడంతో బోల్తా
- ఆరుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
కారేపల్లి, మార్చి 29: సెలవుదినం కావడంతో ఆటలాడుకుంటున్న చిన్నపిల్లల్ని మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన సరదా కోసం ఆటోలో తీసుకెళ్లి ప్రమాదానికి గురిచేసిన సంఘటన ఖమ్మంజిల్లా కారేపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కారేపల్లి మండలంలోని పేరుపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్, యజమాని వజ్జ సునీల్ అనే యువకుడు అతిగా మద్యం సేవించాడు. గ్రామంలో ఆటలు ఆడుకుంటున్న ఆరుగురు విద్యార్థులను తన ఆటోలో సరదాగా ఎకించుకున్నాడు.
పేరుపల్లి నుంచి కోటిలింగాల వెళ్లే మార్గంలో ఆటోను చెకర్లు కొడుతూ తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో జమాల్లపల్లి గ్రామ సమీపంలో తను నడుపుతున్న ఆటోను ఓ విద్యార్థి చేతికిచ్చాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు పులసం యశ్వంత్, అలెం స్నేహిత్, ధనసరి భరత్, అలెం తేజ, అలెం చిట్టూ, ధనసరి ప్రవీణ్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యశ్వంత్, స్నేహిత్‌లకు తీవ్రగాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

