భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు భద్రాద్రి జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో జరిగే బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఆయనతోపాటు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ కవిత, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హాజరుకానున్నారు. కాగా శుక్రవారం రాత్రికే హరీశ్‌రావు సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. శనివారం ఉదయం భద్రాచలంలోని సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అధ్యక్షతన జరిగే మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో మణుగూరులో నిర్వహించే సమావేశానికి, తరువాత కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి హాజరుకానున్నారు.