ఖమ్మం : ఖమ్మం జిల్లా అసిస్టెంట్ లేబర్ (Assistant Labor Officer) అధికారి కర్నె చందర్ ( Karne Chander ) ఏసీబీ అధికారులకు చిక్కాడు. బాధితుడి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ( ACB ) రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
బాధితుడి తండ్రి మరణానికి సంబంధించిన దరఖాస్తును ఉన్నత అధికారులకు పంపి తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కింద సహజ మరణ అంత్యక్రియల ఖర్చు కింద రావాల్సిన లక్షా 30వేల రూపాయలను మంజూరు చేయాలని కోరగా అధికారి లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏవో కర్నె చందర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అరెస్టుచేసి కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.