కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఆగస్టు 25 : కేంద్ర ప్రభుత్వం పెంచిన జీతాలు వెంటనే ఇవ్వాలని, పారితోషికాలు తగ్గించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధ) ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి పద్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దొడ్డా రవికుమార్‌లు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇస్తానని వాగ్దానం చేశారని, అయితే రెండేళ్లు గడుస్తున్నా హామీ అమలులో విఫలమయ్యారని ఆరోపించారు. వెంటనే పెంచిన వేతనాలు చెల్లించి తమను ఆదుకోవాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఝాన్సీ, ధనలక్ష్మి, సేత్య, గద్దెల శ్రీనివాస్, జయ, రుక్మిణి, మనీలా, సుశీల, సుగుణ, హైమావతి, సుజాత, ఉష పాల్గొన్నారు.