తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘వైద్యారోగ్య దినోత్సవం’ ఘనంగా జరిగింది. వేడుకలతో ప్రభుత్వ ఆసుపత్రులు, కల్యాణ మండపాల్లో సందడి నెలకొన్నది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అజయ్‌కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం రూరల్‌లో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, మధిరలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, ఇల్లెందులో హరిప్రియ, మణుగూరు పట్టణంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.
ఇల్లెందు రూరల్, జూన్ 14: వైద్యరంగంలో సీఎం కేసీఆర్ నూతన ఒరవడి సృష్టిస్తున్నారని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామాల్లోనూ నాణ్యమైన సర్కారు వైద్యం అందుతోందని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రి ఇన్చార్జి డాక్టర్ శిరీష్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో బుధవారం వైద్యారోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా వైద్యులు, మహిళలతో కలిసి బతుకమ్మను ఆడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. గతంలో ఇల్లెందు నియోజకవర్గంలో ఏదైనా ప్రమాదం సంభవించినా, గర్భిణులు వైద్య సేవలు పొందాలన్నా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం నగరానికి గానీ లేదా కొత్తగూడేనికి గానీ వెళ్లేవారని గుర్తుచేశారు. అయితే నియోజకవర్గంలోని వైద్యారోగ్య శాఖ సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారు వెంటనే స్పందించి ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిని వైద్యవిధాన పరిషత్‌లోకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దీంతో ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో సకల సౌకర్యాలు, సదుపాయాలు, డాక్టర్లు, ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్ సెంటర్ లాంటివి సమకూరినట్లు వివరించారు.
నేడు ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో 16 మంది స్పెషలిస్టు డాక్టర్లు ఉన్నట్లు చెప్పారు. రూ.85 లక్షల నిధులతో ఇల్లెందు ఆసుపత్రిని అభివృద్ధి చేశామన్నారు. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న డయాలసిస్‌ను ఇల్లెందులో ఏర్పాటు చేయడంతో ఐదు మండలాల కిడ్నీ రోగులకు ఊరట లభించిందని అన్నారు. అనంతరం బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, దిండిగాల రాజేందర్, పులిగళ్ల మాధవరావు, మరియన్న, అంకుషావలి, చీమల నాగరత్నమ్మ, జానీపాష, జనగం కోటేశ్వర్రావు, డాక్టర్లు హర్ష, బన్సీలాల్, కాంత, మురళీకృష్ణ, దినేశ్, విజయ్, అవినాశ్, రాజ్‌కుమార్ జాదవ్, సాగర్, చందన, గైనకాలజిస్ట్ డాక్టర్ సింధు, చరిష్మ, కవిత, హెడ్ నర్సు జగదాంబ, డీపీహెచ్ఎన్ అన్న మేరి తదితరులు పాల్గొన్నారు.