ఖమ్మం ఎడ్యుకేషన్, మే 21 : ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరిగే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో రవిబాబు సీఎస్, డీవోలకు సూచించారు. మంగళవారం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎస్, డీవోలు, కస్టోడియన్లకు పూర్తిస్థాయి శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 42 పరీక్షా కేంద్రాల్లో మొదటి సంవత్సరం 10,352 మంది, ద్వితీయ సంవత్సరం 4,632 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల సీల్‌ను కేంద్రాల్లోని సీసీ కెమెరాల వద్ద ఓపెన్ చేయాలని, కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. సీఎస్‌లు, డీవోలు, డీఈసీ సభ్యులు వెంకటేశ్వరరావు, వీరభద్రరావు పాల్గొన్నారు.