ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు.
- భద్రాద్రి జిల్లా ఆర్వో, కలెక్టర్ ప్రియాంక ఆల
భద్రాద్రి కొత్తగూడెం, మే 18 (నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. శనివారం ఐడీవోసీ సమావేశ మందిరంలో ఏఆర్వోలు, నోడల్ ఆఫీసర్లు, తహసీల్దార్లతో పోలింగ్ అధికారుల నియామకం, ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 27న, కౌంటింగ్ జూన్ 5న ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 55 పోలింగ్ కేంద్రాలు, 76 మంది పీవోలు, 76 మంది ఏపీవోలు, 160 మంది వోపీవోలు అవసరం ఉన్నట్లు చెప్పారు. ఆ దశగా ఏర్పాట్లు చేయడంతోపాటు పోలింగ్ విధులకు సిబ్బందిని కేటాయించాలన్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 5 ఫ్లయింగ్ స్కాడ్, 5 ఎంసీసీ బృందాలను ఏర్పాటు చేసి నిఘా పకడ్బందీగా చేపట్టాలన్నారు. జిల్లాలో 40,106 మంది పట్టభద్రుల ఓటర్లు నమోదు కాగా.. ఇందులో 22,590 మంది పురుషులు, 17,516 మంది మహిళలు ఉన్నారన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఆర్డీవోలు మధు, దామోదర్రావు, ఎన్నికల సూపరింటెండెంట్ దార ప్రసాద్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ రంగా ప్రసాద్, నోడల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

