ఖమ్మం: విదేశీ విద్యా పథకం కింద 2022-23 విద్యాసంవత్సరానికి గానూ తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు శ్రీవైష్ణవ సేవా సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మరింగంటి భార్గవాచర్యులు, కొదమసింహం రవికిరణా చార్యులు తెలిపారు. జనవరి 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఆన్లైన్లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వెబ్సైట్లో మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన దృవీకరణ పత్రాలను జతచేయాల్సి ఉంటుందన్నారు. అర్హులైన వైష్ణవ బంధువులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.