ఖమ్మం రూరల్, అక్టోబర్ 18 : ఖమ్మం రూరల్ మండలంలోని రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఖమ్మం రూరల్ మండలానికి గాను మాన్యువల్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, పవర్ టిల్లర్, బ్రష్ కట్టర్, పవర్ వీడర్ సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ శాఖ అధికారి ఉమా నగేష్ తెలిపారు. ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. కావున ఆసక్తి గల రైతులు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చున్నారు. చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీ మీద పరికరాలు అందజేయడం జరుగుతుందన్నారు. కావున ఆసక్తి గల రైతులు దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, రైతు పాస్ పోర్ట్ ఫొటోలు (2) లతో సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు స్థానిక ఏఈఓను సంప్రదించాలని పేర్కొన్నారు.