కారేపల్లి, జూలై 19 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను స్పాట్ అడ్మిషన్లకై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రత్యేక అధికారి జి.ఝాన్సీ సౌజన్య తెలిపారు. కళాశాలలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీసీ, బైపీసీలలో 8 సీట్ల చొప్పున ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థినులు ఈ నెల 22వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని పదో తరగతి పాసైన విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.