కారేపల్లి, జూన్ 19 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని రేలకాయలపల్లి గిరిజన బాలుర వసతి గృహంలో సీట్లు భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నూనావత్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పాఠశాలలో గురువారం పాఠశాల సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 6, 7, 8, 9, 10వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు డి.భిక్షం, బి.వెంకటేశ్, జి.సక్రాం, ఎం.రాంబాబు, జి.వీరన్న, ధరావత్ సుశీల, జి.శ్యామల, డి.తార, సిహెచ్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.