Khammam | పిల్లల దత్తతకు దరఖాస్తుల స్వీకరణ..

ఖమ్మం : అవాంచిత గర్బం ద్వారా పుట్టిన పిల్లలు ఇష్టం లేకుంటే తమకు అప్పగించాలని, కంటికి రెప్పలా చూసుకొని వేరొకరికి దత్తత ఇస్తామని జిల్లా స్త్రీ శిశుసంక్షేమ శాఖ అధికారి సీహెచ్ సంధ్యారాణీ తెలిపారు. పుట్టిన పిల్లలను పొదల్లో, ఇతర నిర్జీవ ప్రాంతాలలో వదిలేయడం వల్ల శిశువు ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. పిల్లలు ఇష్టం లేకపోతే తమకు నేరుగా కాకుండా ఇతర మార్గాల ద్వారా అయినా అప్పగించ వచ్చన్నారు. ఖమ్మం ప్రధాన వైద్యశాల మాతాశిశు విభాగంలో ఇందుకోసం ప్రత్యేకంగా ఊయల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అంతేకాకుండా గట్టయ్య సెంటర్ ప్రాంతంలోని బాల రక్షాభవన్ అధికారులను సంప్రదించవచ్చన్నారు. ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు, పేదరికంతో పిల్లలను పెంచే శక్తి లేనివారు, తల్లితండ్రులు చనిపోయిన పిల్లలను సైతం ఈ ఊయాలలో ఉంచవచ్చన్నారు. అలాంటి పిల్లలను చేరదీసి శిశుగృహలో ఉంచి వారి ఆలనా, పాలన చూసుకోవడం జరుగుతుందన్నారు.
అదే విధంగా పిల్లలు లేని తల్లితండ్రులు సైతం పిల్లల దత్తత కోసం తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు. నియమనిబంధనల ప్రకారం దంపతుల పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, వివాహ దృవపత్రం, ఆరోగ్య దృవపత్రాలను జత పరచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వెబ్సైట్ CARA.NIC.IN లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మూడు సెట్ల జిరాక్స్ పత్రాలను రూ. 6వేల డీడీని తమ కార్యాలయంలో అందజేయాలని ఆమె సూచించారు. దరఖాస్తుల సీనియారిటి ప్రకారం పిల్లలను దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాల కోసం నగరంలోని శిశుగృహ అధికారులకు సంప్రదించవచ్చన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాట్నాలో కంట్రోల్ఎస్ డాటా సెంటర్
హెచ్‌సీఏ సభ్యుల బ్లాక్ టికెట్ల దందా
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

