బోనకల్లు, ఆగస్టు 28 : ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే అధికారులకు తెలియజేయాలని బోనకల్లు ఎంపీడీఓ రమాదేవి అన్నారు. గురువారం మండలంలోని 22 గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయంలో ఓటరు జాబితా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని నోటీస్ బోర్డులపై ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. నోటీసు బోర్డులో ప్రచురణ చేసిన ఫొటో ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలపై గ్రామ ప్రజలకు ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 30 వరకు సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులకు లిఖిత పూర్వకంగా తెలుపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీరాజ్ అధికారి వ్యాకరణం వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.