‘కాన్వెంట్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు’
ప్రైవేట్ కాన్వెంట్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత, ఐసిడిఎస్ ఖమ్మం రూరల్ ప్రాజెక్టు అధికారి కమల ప్రియ తెలిపారు. శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో..
– ఖమ్మం మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత, సీడీపీఓ కమలప్రియ
ఖమ్మం రూరల్, మే 30 : ప్రైవేట్ కాన్వెంట్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత, ఐసిడిఎస్ ఖమ్మం రూరల్ ప్రాజెక్టు అధికారి కమల ప్రియ తెలిపారు. శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జలగం నగర్ సెక్టార్ పరిధిలోని 23వ వార్డు ఇందిరమ్మ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్, సిడిపిఓ తొలుత ఆరు సంవత్సరాలు నిండిన అంగన్వాడీ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో సమాజంలో ప్రైవేట్ విద్యా సంస్థలలో అధిక ఫీజులు చెల్లించాల్సి వస్తుందన్నారు.
ప్రీ స్కూల్ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపినట్లయితే నాణ్యమైన విద్యతో పాటు సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన పోషకాహారం అందించడం జరుగుతుందన్నారు. ప్రీస్కూల్ పిల్లలకు ఆంగ్ల బోధన, ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గర్భిణీలు, బాలింతలు సైతం నిత్యం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి స్త్రీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలను, సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని వారు కోరారు. అనంతరం కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ పుష్పలత, అంగన్వాడీ లెవల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, పిల్లల తల్లులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

