కారేపల్లి, నవంబర్ 07 : ప్రజా పోరాటాల్లో దారావత్ అనసూర్య కుటుంబం కీలక పాత్ర పోషిస్తున్నారని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మెరుగు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. కారేపల్లి మండలం మాణిక్యారం(గుడితండా)లో సీపీఐ(ఎం) శాఖ సభ్యులు, గిరిజన సంఘం నాయకులు ధరావత్ వశ్యానాయక్ సతీమణి అనసూర్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె సంస్మరణ సభ వజ్జా రామారావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సభలో నాయకులు మాట్లాడుతూ.. మాణిక్యరం ప్రాంతంలో సీపీఐ(ఎం) నిర్వహించే అనేక ఉద్యమ పోరాటానికి దారావత్ వశ్య నాయక్, ఆయన సతీమణి అనసూర్య ముందుండేవారన్నారు. మాణిక్యారం, చీమలపాడు ప్రాంతంలో గిరిజన, గిరిజనేతర పేదలు పోడు భూమి పైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. పేదల పోడు రక్షించటానికి జైలు, పోలీస్ కేసులు ఫారెస్ట్ నిర్భందాలు లెక్కచేయకుండా సీపీఐ(ఎం) చేసిన పోరాట ఫలితంగా నేడు పోడు సాగు జరుగుతుందన్నారు. ఎర్రజెండా సిద్ధాంతాన్ని నమ్మిన అనసూర్య ఆశయ సాధనకు అంతా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యురాలు మెరుగు రమణ, మండల కార్యదర్శి కె.నరేంద్ర, నాయకులు కొండబోయిన ఉమావతి, కరపటి సీతారాములు. కల్తీ రామచంద్రయ్య, పోతర్ల నాగేశ్వరరావు, భూక్య రమేశ్, చల్ల మల్లమ్మ, పాయం వరలక్ష్మి, సాగబోయి లక్ష్మయ్య, మాజీ సర్పంచులు కరపటి సీతమ్మ, ధారావత్ కిషన్,భూక్య సైదా, భూక్య రంగారావు, డీసీసీబీ డైరెక్టర్ దారావత్ బద్దులాల్, కొత్తూరి రామారావు, బీఆర్ఎస్ యువజన నాయకులు ధారావత్ వికాస, అనసూర్య భర్త దారావత్ వశ్యా నాయక్, కుమార్తె శ్రావణి, అల్లుడు హరిబాబు పాల్గొన్నారు.

Karepally : ‘ప్రజా పోరాటాల్లో అనసూర్య కుటుంబం కీలక పాత్ర’