అంబేద్కర్ ఆశయాలను సాధించాలి
భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు.
- ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర
- ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో అంబేదర్ జయంతి
ఖమ్మం, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. అంబేదర్ స్ఫూర్తితో కేసీఆర్ పాలన కొనసాగించారని, దేశంలో ఎకడా లేనివిధంగా హైదరాబాద్లో 125 అడుగుల అంబేదర్ విగ్రహం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ సచివాలయానికి కూడా ఆయన పేరు పెట్టడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాములునాయక్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మేయర్ పునుకొల్లు నీరజ, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఖమ్మంరూరల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పార్టీ నాయకులు తాళ్లూరి జీవన్, మైనార్టీ నాయకులు తాజుద్దీన్, సాజిద్, లింగాల రవికుమార్, కన్నం ప్రసన్నకృష్ణ, డోలే ప్రసన్నలక్ష్మిసాయి, ప్రసాద్, కార్పొరేటర్లు దాదే అమృతమ్మ సతీశ్, షకీనా, అబ్బాస్, బొమ్మెర రామ్మూర్తి, సుబ్బారావు, ఉప్పల వెంకటరమణ, చిత్తారు సింహాద్రియాదవ్, శీలంశెట్టి వీరభద్రం,ముస్లిం మైనార్టీ నాయకులు తాజుద్దీన్, పార్టీ నాయకులు చెరుకుమల్లి రవి, వాకదాని కోటేశ్వరరావు, బెల్లం వేణు, మేకల సుగుణారావు, పలువురు కార్పొరేటర్లు జ్యోతిరెడ్డి, నామా సేవా సమితి సభ్యులు రాజేశ్, చీకటి రాంబాబు, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పాలన
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మామిళ్లగూడెం, ఏప్రిల్ 14 : అంబేదర్ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ ఆలోచనా మార్గంలో మనందరం నడవడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ప్రపంచ మేధావిగా అన్నిదేశాల చట్టాలను అధ్యయనం చేసి దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన సామాజికవేత్త అంబేదర్ అని కొనియాడారు. అనంతరం విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడుతూ ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిధులను సమీకరించిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వీరితోపాటు కిరణ్ ముగభాత్సవ్, రాయల నాగేశ్వరరావు, మహ్మద్ జావేద్, నాగండ్ల దీపక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

