కారేపల్లి (ఏన్కూర్), ఆగస్టు 07 : ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తిమ్మారావుపేట ఐసీడీఎస్ సర్కిల్లోని అంగన్వాడీ టీచర్లను ఐసీడీఎస్ సూపర్వైజర్ బక్కమ్మ వేధిస్తుందన్న ఆరోపణలు అవాస్తవం అని తిమ్మరావుపేట సర్కిల్ పరిధిలోని టీచర్స్ గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొంతకాలంగా తిమ్మారావుపేట సర్కిల్లో అంగన్వాడీ టీచర్లు ఇ.పారిజాతం, జి.శిరోమణిలను సూపర్వైజర్ బక్కమ్మ వేధిస్తుందని ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ ఇద్దరు టీచర్స్ సెంటర్స్ ఓపెన్ చేయకుండా సూపర్వైజర్ పర్మిషన్ ఇవ్వడం లేదని అబద్ధం చెబుతూ వారికి అనుకూలంగా ఉన్న యూనియన్‌లో చేరాలని ఒత్తిడి చేసినట్లు తెలిపారు.
సూపర్వైజర్పై కక్షగట్టి వేధిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై మిగతా అంగన్వాడీ టీచర్లకు, సర్కిల్‌కి చెడ్డ పేరు రావడమే కాకుండా విధులను నిర్వహించలేక పోతున్నట్లు వారు తెలిపారు. ఈ విషయమై సత్వర పరిష్కారం చూపి సెంటర్ సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ జిల్లా కలెక్టర్, డీడబ్ల్యూఓ పీడీని కలిసి వినతి పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. వినతి పత్రాలు ఇచ్చిన వారిలో తిమ్మారావుపేట సర్కిల్ అంగన్వాడీ టీచర్లు సుజాత, భద్రకాళి, ఆంధ్రా వాణి, నరసమ్మ, సుమిత్ర, విజయలక్ష్మి పాల్గొన్నారు.
Karepalli : ‘ఐసీడీఎస్ సూపర్వైజర్ బక్కమ్మపై ఆరోపణలు అవాస్తవం’