ఖమ్మం, జనవరి 1: ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలంతా ఈ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో జీవించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు. శాంతి, ఆరోగ్యం, సిరిసంపదలతో శోభిల్లాలని, లక్ష్యాలను సాధించాలని, పంటలు సమృద్ధిగా చేతికొచ్చి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని అభిలషించారు.
న్యూ ఇయర్ సందర్భంగా నామా సేవా సమితి బాధ్యులు రూపొందించిన క్యాలెండర్ను ఖమ్మంలోని తన స్వగృహంలో సోమవారం ఆయన ఆవిషరించి మాట్లాడారు. కొత్త సంవత్సరం మరింత ఆనందంగా ఉండాలని, అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సమితి బాధ్యులు పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, దేవభక్తిని నవీన్, రేగళ్ల కృష్ణప్రసాద్, మునిగంటి భార్గవ్, పగడాల రవి, మంకెన అజయ్, బయ్యన అశోక్, వట్టికొండ మానస్ తదితరులు పాల్గొన్నారు.