ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 25: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు, పాఠకులకు, విద్యార్థులకు ఉపయోగంగా ఉండేలా అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రంథాలయ సంస్థలకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలపై నూతన కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం ఆయన సమీక్షించారు.
కమిటీ సభ్యులు ఏడు అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ నిర్వహణ వ్యయానికి సంబంధించి బడ్జెట్ అంచనాలను రూపొందించి పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుల ఆమోదాన్ని కోరుతూ తీర్మానించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ మయాంక్ సింగ్, డీపీవో హరికిషన్, మంజువాణి, ఏఎంవో రవికుమార్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.